Ashwin Yardi: రోజుకి 9.30 గంటల పని చేస్తే చాలు: సీఈఓ అశ్విన్ యార్ది 1 y ago
పనివేళలపై జరుగుతున్న చర్చలో క్యాప్ జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది స్పందించారు. వారానికి 9.30 గంటల చొప్పున ఐదు రోజులు పనిచేస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు ఉత్పాదకతే ముఖ్యమని, వారాంతాల్లో ఉద్యోగులకు మెయిల్ పంపకుండా పని చేస్తానని తెలిపారు. ఈ అభిప్రాయాన్ని నాస్కామ్ ఛైర్పర్సన్ సింధు గంగాధరన్ కూడా సమర్థించారు.